PNB Scam : PNB Fraud Amount Can Rise By Rs 1,300 Crore

2018-02-27 110 Dailymotion

Download Convert to MP3

Amid the multi-agency probe into the PNB scam, the state-run bank on Tuesday said the amount of fraudulent transactions could be Rs 1,300 crore more than the current estimate of about Rs 11,400 crore. BJP MP Shatrughan Sinha tore into his party's government again on Monday.

పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో మరో కుంభకోణం జరిగినట్టు బ్యాంకు వెల్లడించింది. ఇప్పటికే రూ.11,300 కోట్లకు నీరవ్ మోడీ ముంచినట్లు తేలగా, ఆయన మరో రూ.1,322 కోట్ల మేర మోసం చేసినట్టు తాజాగా వెలుగు చూసింది.
నీరవ్ మోడీ, ఆయన మామ, వ్యాపార భాగస్వామి అయిన మేహుల్ చోక్సీతో కలిసి రూ.1,322 కోట్ల మేర అనధికారిక లావాదేవీలు నిర్వహించినట్టు బ్యాంకు పేర్కొంది. ఫలితంగా ఈ కుంభకోణం మొత్తం రూ.12,622 కోట్లకు చేరుకుంది.
ఈ విషయాలను ముంబై స్టాక్ ఎక్స్‌చేంజ్ వెల్లడించింది. నీరవ్ మోడీ, మెహూల్ చోక్సీలు కలిసి 204 డాలర్ల విలువైన అనధికారిక లావాదేవీలు నిర్వహించినట్టు తేలిందని బాంబే స్టాక్ ఎక్సేంజ్ ప్రకటించింది. దీంతో పీఎన్‌బీ షేర్లు మరింత కిందకు దిగాయి. 52 వారాల కంటే దిగువకు దిగింది. మరోవైపు, నీరవ్ మోడీని భారత్‌కు రప్పించేందుకు సీబీఐ చర్యలను వేగవంతం చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఆయనకున్న ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు సిద్ధమవుతోంది.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణంపై బిజెపి అసమ్మతి ఎంపీ శతృఘ్న సిన్హా ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ప్రభుత్వ రంగ సంస్థ అయిన పిఎన్‌బీలో కుంభకోణం నాలుగేళ్లుగా సాగుతున్నా కేంద్రం తెలియనట్టు ఎందుకు వ్యవహరించిందని ఆయన ప్రశ్నించారు. ఈ కుంభకోణానికి పిఎన్‌బీ ఆడిటర్లే కారణమని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అనడాన్ని శతృఘ్న సిన్హా తప్పు పట్టారు.

coinpayu